స్పందన కార్యక్రమానికి తొమ్మిది అర్జీలు

UPDATED 29th JULY 2019 MONDAY 5:00 PM 

పెద్దాపురం: ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో ఎస్.మల్లిబాబు అన్నారు. పెద్దాపురం ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి తొమ్మిది అర్జీలు వచ్చినట్లు ఆర్డీవో తెలిపారు. వీటిలో పంచాయతీలో జరిగిన అవకతవకలపై రికవరీ చేయించమని ఒకటి, పట్టాదారు పాసు పుస్తకాలకు సంబంధించి రెండు, పాఠశాల ప్రాంగణంలో ఆకతాయిల వేధింపులపై చర్యలు తీసుకోవాలని ఒకటి, ఆక్రమణకు గురైన రహదారిని తిరిగి వేయించమని ఒకటి, డ్రైనేజీ ఏర్పాటు చేయమని ఒకటి, శానిటేషన్ పనులు చేయించమని ఒకటి, భూమి పట్టాలు ఇప్పించమని ఒకటి, భూమిని తిరిగి సర్వే చేయించమని ఒకటి అర్జీలు వచ్చినట్లు ఆర్డీవో తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో సమస్యలు ఉంటే అర్జీల ద్వారా తొలుత మండల తహసీల్దార్ కార్యాలయంలో అందచేయాలని, మండల స్థాయిలో పరిష్కారం కాని అర్జీలను ఆర్డీవో కార్యాలయంలో అందజేయాలని తెలిపారు. అర్జీలు పరిష్కారం నిమిత్తం ఆయా శాఖలు ప్రభుత్వ నియమ,నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించడం జరుగుతుందని ఆయన తెలిపారు.  

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us