ఆటో స్టాండ్ యూనియన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

UPDATED 18th MARCH 2018 SUNDAY 10:00 PM

సామర్లకోట: స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో రైల్వే ఆటోస్టాండ్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన చలివేంద్రాన్ని శ్రీ భీమేశ్వరస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కంటే జగదీశ్ మోహన్ రావు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహాన్ని తీర్చడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ రమణ, వైస్ ప్రెసిడెంట్ నందిక చక్రం, సెక్రటరీ సత్తిబాబు, క్యాషియర్ జంధ్యాల రమణ, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us