UPDATED 16th APRIL 2019 TUESDAY 9:00 PM
సామర్లకోట: సామర్లకోట మండలం హుస్సేన్ పురం గ్రామంలో బాల్య వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం పోలీసులు, ఐసిడిఎస్, చైల్డ్ లైన్, లేబర్ అధికారులు హుస్సేన్ పురం గ్రామానికి చేరుకుని వివాహాన్ని నిలుపుదల చేశారు. వివాహ వయస్సు రాకుండా పెళ్లి చేయడం ఎన్నో అనర్ధాలకు దారితీస్తుందని బాలికకు, తల్లిదండ్రులకు ఈ మేరకు అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆర్ధిక ఇబ్బందులు కారణంగా తమ కుమార్తెకు వివాహం చేయాలనుకున్నామని, మీరు ఇచ్చిన కౌన్సిలింగ్ వల్ల తమకు ఎంతో అవగాహన కలిగిందని బాలిక తల్లిదండ్రులు తెలిపారు. ఈ సందర్భంగా పెద్దాపురం లేబర్ ఆఫీసర్ రఘుపతి, ఐసిడియస్ సూపర్ వైజర్ కుమారి, చైల్డ్ లైన్ సిబ్బంది బి. లక్ష్మి, వీఆర్వో వల్లి, తదితరులు పాల్గొన్నారు.







