బాక్సింగ్ విజేతకు అభినందనలు

UPDATED 7th JUNE 2018 THURSDAY 7:00 PM

రాజానగరం: ప్రపంచస్థాయి బాక్సింగ్ పోటీల్లో ప్రతిభా పాటవాలు ప్రదర్శిం చి, మాతృదేశానికి, రాష్ట్రంతో పాటు గైట్ కళాశాలకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. గోవర్ధన రామానుజం ఆకాంక్షించారు. ఇటీవల నేపాల్ లో జరిగిన ఇండో-నేపాల్ గుడ్ విల్ రూరల్ గేమ్స్ ఇంటర్నేషనల్ ఛాంపియన్ షిప్ పోటీల్లో బంగారు పతకాలు సాధించిన గైట్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థిని కె. జ్యోత్స్నాదేవికి గురువారం కళాశాలలో అభినందన సభ జరిగింది. ఈ సందర్భముగా విద్యార్థినిని ప్రిన్సిపాల్, కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ కళాశాల విభాగాధిపతులు, లెక్చరర్లు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us