UPDATED 7th MARCH 2021 SUNDAY 8:00 PM
గండేపల్లి (రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గల సరస్వతి, షిర్డీ సాయిబాబా ఆలయాల తృతీయ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదిత్య విద్యా సంస్థల అధినేత డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, లక్ష్మీరాజ్యం దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరస్వతీ దేవి, సాయిబాబా వారికి అభిషేకాలు, హోమాలు, ప్రత్యేక హారతులు, తదితర పూజలు నిర్వహించారు. అనంతరం గోపూజ నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీరామ్ శర్మ, ప్రసాద్ శర్మల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో ఆదిత్య కుటుంబ సభ్యులు, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







