UPDATED 24th AUGUST 2017 THURSDAY 7:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్, ఫార్మసీ చదువుతున్న కేరళకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు ఓనం పర్వదినాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంప్రదాయ వస్త్రధారణ, ముగ్గులు, పిండివంటలతో కేరళ సంప్రదాయాన్ని ఇనుమడింపచేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రాంతాలకతీతంగా జరుపుకునే ఈ ఓనం పండుగకు ఎంతో విశిష్టత ఉందన్నారు. అలాగే సంప్రదాయాలను కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఓనం పండుగకు ఎంతో శ్రద్ధ తీసుకుని కార్యక్రమాన్ని నిర్వహించడంపై కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం. శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామ కృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, డాక్టర్ కె. రవి శంకర్, డాక్టర్ దివాకర్ లు పాల్గొన్నారు.







