ఘనంగా భీమేశ్వరస్వామి తెప్పోత్సవం

UPDATED 25th NOVEMBER 2018 SUNDAY 10:00 PM

సామర్లకోట: కార్తీకమాసం పురస్కరించుకుని శ్రీ చాళుక్య కుమారారామ భీమేశ్వరస్వామి వారి తెప్పోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ తెప్పోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ఉపముఖమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప దంపతులు హాజరై ముందుగా ఆలయ ధ్వజస్థంభం వద్ద దీపారాధన కార్యక్రమంలో పాల్గొని స్వామి, అమ్మవార్లకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలు, విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన హంస వాహనంపై స్వామి, అమ్మవార్లను పవిత్ర గోదావరి పుష్కరిణిలో జలవిహారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ పంచారామాల్లో ఒకటైన భీమేశ్వరస్వామి స్వామివారి సేవలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ప్రతీ సంవత్సరంలా ఈ సంవత్సరం కూడా తెప్పోత్సవ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పులి నారాయణమూర్తి, కంటే జగదీష్ మోహన్, పడాల వీరబాబు, దూది రాజు, మహంకాళి వెంకట గణేష్, వేదపండితులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us