UPDATED 15th OCTOBER 2018 MONDAY 9:00 PM
రాజానగరం: చేతులు పరిశుభ్రత విషయంలో ప్రతీ ఒక్కరూ ప్రత్యేక శ్రద్ద వహించాలని అంగన్వాడీ కార్యకర్త పి. సీత పేర్కొన్నారు. స్థానిక న్యూ కాలనీలోని ఒకటవ నెంబర్ అంగన్వాడీ కేంద్రంలో సోమవారం జరిగిన ప్రపంచ చేతుల పరిశుభ్రతా దినోత్సవం కార్యక్రమంలో భాగంగా చేతుల పరిశుభ్రతపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్త సీత మాట్లాడుతూ ప్రతీరోజు చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలను చిన్నారులకు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో తల్లులు, అంగన్వాడీ సహాయకురాలు వరలక్ష్మి, వైద్య ఆరోగ్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







