విత్తన శుద్ధితో అధిక దిగుబడులు

UPDATED 11th JUNE 2020 THURSDAY 5:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): విత్తన శుద్ధితో అధిక దిగుబడులు సాధించవచ్చని ఆత్మ పీడీ జి. సునీత పేర్కొన్నారు. స్థానిక రైతు శిక్షణ కేంద్రంలో గ్రామీణ వ్యవసాయ సహాయకులకు విత్తన శుద్ధి, ఎంపికపై గురువారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విత్తనశుద్ది ద్వారానే అధిక దిగుబడులు సాధించవచ్చని అన్నారు. రైతు శిక్షణా కేంద్రం డీడీ నాగాచారి మాట్లాడుతూ ప్రస్తుతం పండించే వరి రకాలైన ఎంటీయూ-1061,1064, బిపిటి-5204, స్వర్ణ రకాలు మేలైనవని సూచించారు. ఏడిఏ ఎం. రత్నప్రశాంతి మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎరువులు, విత్తనాలను పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతు శిక్షణ కేంద్రం ఏడీఏ ఏవీఎస్ రాజశేఖర్, మాధవి, ఎఫ్.టీ.సి ఏవో ఇందిరా ఝాన్సీ, ఏఈవో ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us