బాల కార్మికులకు విముక్తి కల్పించేందుకు ఆపరేషన్ ముస్కాన్

UPDATED 20th NOVEMBER 2019 WEDNESDAY 9:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): బాల కార్మికులకు విముక్తి కల్పించేందుకు ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించినట్లు ప్రత్తిపాడు సిఐ సన్యాసిరావు తెలిపారు. రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశాల మేరకు పెద్దాపురం సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు, వివిధ శాఖల సమన్వయంతో బుధవారం ఆపరేషన్‌ ముస్కాన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా బస్‌ స్టేషన్లు, సినిమా హాళ్లు, పార్కులు, ఫ్యాక్టరీలతో పాటు చట్ట విరుద్ధంగా బాల కార్మికులతో పని చేయిస్తున్న గృహాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 12 మంది బాల కార్మికులను గుర్తించారు. అనంతరం బాల కార్మికులకు వైద్య పరీక్షలు చేయించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట ఎస్ఐ సుమంత్, తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.     

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us