UPDATED 21st DECEMBER 2020 MONDAY 9:00 PM
రాజానగరం (రెడ్ బీ న్యూస్): రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా కొంతమూరు శానిటోరియం వద్ద ఉచిత మెగా దంత వైద్య శిబిరం సోమవారం నిర్వహించారు. స్థానిక లెనోరా దంత వైద్య కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరాన్ని కళాశాల కార్యదర్శి వై. మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ శిబిరంలో వైద్యులు పలువురికి దంత పరీక్షలతో పాటు రక్త పరీక్షలు కూడా నిర్వహించి ఉచితంగా మందులు అందచేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ జి. నాగార్జునరెడ్డి, వైద్యులు డాక్టర్ నవీన్ కుమార్, డాక్టర్ అన్వేష్, డాక్టర్ అఖిల్, డాక్టర్ భరధ్వాజ్, డాక్టర్ శ్రీకృష్ణ, డాక్టర్ ప్రతాప్, డాక్టర్ సంధ్య, తదితరులు పాల్గొన్నారు.







