UPDATED 14th JULY 2018 SATURDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాల వ్యాయమ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న మానం వెంకటేశ్వరావుకు పిడిగా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ సి.హెచ్. వెంకటేశ్వరావు ముఖ్య అతిథిగా పాల్గొని పిఇటిని దుశ్శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. పాఠశాల హెచ్ఎం తోటకూర సాయిరామకృష్ణ, ఉపాధ్యాయులు ఎ.ఎల్ వి. కుమారి, కె. శ్రీనివాస్, జి. గోవిందు, కె. అరుణ, కె.వి.వి. సత్యనారాయణ, ఎ.పి. రాజేంద్ర కుమార్, కోడూరి శివ ప్రసాద్, తదితరులు ఆయనను అభినందించారు.







