UPDATED 29th APRIL 2019 MONDAY 9:00 PM
సామర్లకోట: జిల్లా సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన మన ఊరు- మనబడి కార్యక్రమంలో భాగంగా సామర్లకోట మండల పరిధిలోగల గ్రామాల్లో మన ఊరు-మన బడి ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని అంగన్వాడీల పరిధిలోని ప్రీ ప్రైమరీ విద్యను అభ్యసించిన ఐదు సంవత్సరాలు నిండిన బాల, బాలికలను తల్లిదండ్రులను ప్రోత్సహించి వారు ప్రభుత్వ పాఠశాలల్లో నమోదయ్యే విధంగా ప్రోత్సహించి వారికి అడ్మిట్ కార్డులు అందచేశారు. బడిఈడు పిల్లలందరికీ సర్వశిక్షా అభియాన్ అందించే 17 రకాల ప్రోత్సహకాలు గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రాథమిక విద్యను అభ్యసించి ఐదవ తరగతి నుండి ఆరవ తరగతిలో చేరే పిల్లలను ఉన్నత పాఠశాలలో చేరే విధంగా తల్లిదండ్రులను ప్రోత్సహించి వారికి కూడా అడ్మిట్ కార్డులను జారీ చేశారు. అలాగే ప్రైవేటు పాఠశాలలో ప్రీ ప్రైమరీ విద్యనభ్యసించిన ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా తల్లిదండ్రులను ప్రోత్సహించి వారికి కూడా అడ్మిట్ కార్డులను జారీ చేశారు. ఈ విధంగా మన ఊరు- మనబడి కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించారు.







