సమాజాభివృద్ధికి కృషిచేయాలి

UPDATED 25th NOVEMBER 2018 SUNDAY 9:00 PM

సామర్లకోట: కాపు కులస్తులంతా సంఘటితమై సమాజాభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. కాపు నవయువత అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో స్థానిక విస్తరణ శిక్షణా కేంద్రం ఆవరణలో కాపు కార్తీక వనసమారాధన ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ కాపులు అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధించాలని, ఇతర కులాల అభివృద్ధిని కూడా కాంక్షించాలని అన్నారు. సామాజిక, ఆర్థిక అభివృద్ధి సాధించి పేదవారికి సహాయం చేయాలని, యువత పెడదారులు పడుతోందని, వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. కాపు కార్పొరేషన్ నిధుల నుంచి కాపు కళ్యాణ మండపం నిర్మించేందుకు నిధులు కేటాయించామని, ఆ పనులు శరవేగంగా సాగుతున్నాయని, జనవరి నాటికి పూర్తవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి చినరాజప్పతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు, జనసేన పార్టీ నాయకులు తుమ్మల రామస్వామి (బాబు), జై భారత్ నేషనల్ పార్టీ జాతీయ అధ్యక్షులు గోరకపూడి చిన్నయ్యదొర, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, తదితరులు మాట్లాడారు. ఈ సమారాధనలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కాపు నవయువత అభివృద్ధి సంఘం నాయకులు నందమూరి రంగా, దూది రాజు, మహంకాళి వెంకట గణేష్, కమ్మిల ఫనీంద్ర, మడగల శ్యామ్, అధిక సంఖ్యలో కాపు నాయకులు పాల్గొన్నారు.   

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us