UPDATED 16th DECEMBER 2017 SATURDAY 6:00 PM
గండేపల్లి : తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు జిల్లాస్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నిర్వహించనున్నట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 39 కళాశాలలకు చెందిన 15 వందల మంది విద్యార్థులు పాల్గొంటారన్నారు. గేమ్స్ విభాగంలో వాలీబాల్, కబడ్డీ, ఖో-ఖో, చెస్, బాల్ బాడ్మింటన్, షటిల్, పరుగుపందెంలో 100, 200, 400, 800, 1500 మీటర్ల హై-జంప్, లాంగ్ జంప్, బ్రాడ్ జంప్, షాట్ ఫుట్, డిస్కస్ త్రో, జావెలిన్ త్రో విభాగాల్లో పోటీలు నిర్వహించబడతాయని, జిల్లాస్థాయి పోటీల్లో గెలుపొందిన విజేతలు 28, 30 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హులన్నారు. ఈ పోటీలు నిష్పక్షపాతంగా జరిపేందుకు 40 మంది పాల్గొంటారని సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలల డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ ఎ. మాధవరావు, తదితరులు పాల్గొన్నారు..







