ముఖ్యమంత్రిని కలిసిన బొడ్డు

UPDATED 18th DECEMBER 2018 TUESDAY 9:00 PM

సామర్లకోట: పెద్దాపురం నియోజకవర్గంలో గత కొంత కాలంగా మౌనంగా ఉన్న మాజీ ఎంఎల్ఎ బొడ్డు బాస్కర రామారావు మంగళవారం కాకినాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలవడం హాట్ టాపిక్ గా మారింది. పెథాయి తుఫాన్ కారణంగా జిల్లా పర్యటనకు విచ్చేసిన చంద్రబాబుకు హెలిపాడ్ వద్ద బొడ్డు ఘనస్వాగతం పలికారు. పెద్దాపురం నియోజకవర్గం టీడీపీ టిక్కెట్ తనకు కేటాయించాలని గత కొంతకాలంగా బొడ్డు చంద్రబాబుపై వత్తిడి తెస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నెల రోజులుగా టిక్కెట్ భాస్కర రామారావుదే అని నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో మంగళవారం బొడ్డు ముఖ్యమంత్రిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us