ఆదిత్య లో ఘనంగా జాతీయ వ్యవస్థాపక దినోత్సవం

UPDATED 9th NOVEMBER 2017 THURSDAY 8:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో జాతీయ వ్యవస్థాపక దినోత్సవం (నేషనల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ డే) ను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జాతీయ, అంతర్జాతీయ రంగాల్లో 25 సంవత్సరాల విశేష అనుభవం గల డి. అనంతరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవస్థాపకునికి నిర్దిష్టమైన ప్రణాళిక, అవగాహన అవసరమని, విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా సొంతంగా పారిశ్రామిక వేత్తలుగా ఎదిగి నూతన ఆవిష్కరణలతో మరింతమంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేలా తయారుకావాలన్నారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి మాట్లాడుతూ తమ బిజినెస్ స్కూల్ విద్యార్థులకు చదువుతో పాటు వివిధ రంగాలలో నిష్ణాతులైన ప్రముఖ పారిశ్రామికవేత్తలతో వర్క్ షాప్ లు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. విశాలాక్షి, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.        

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us