ఆదిత్యలో ఆస్పిరేషన్ ఎనర్జీ పూల్ క్యాంపస్ డ్రైవ్

UPDATED 28th SEPTEMBER 2019 SATURDAY 6:00 PM

గండేపల్లి(రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో అక్టోబర్ ఒకటవ తేదీన బెంగుళూరుకు చెందిన ఆస్పిరేషన్ ఎనర్జీ సంస్థ పూల్ క్యాంపస్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. 2019వ సంవత్సరంలో బిటెక్ పూర్తి చేసిన మెకానికల్, ట్రిపుల్ ఈ విద్యార్థులు అర్హులని తెలిపారు. సేల్స్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ అండ్ ఆటోమొబైల్ ఉద్యోగాలకు 2018-2019 సంవత్సరం పురుష అభ్యర్థులు అర్హులని, వీరికి రూ.2.40 లక్షలు వార్షిక వేతనం, అలాగే ఛానల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు బిటెక్ మెకానికల్, ట్రిపుల్ ఈ ఉద్యోగాలకు స్త్రీ, పురుష అభ్యర్థులు అర్హులని, వీరికి రూ.1.80 లక్షలు వేతనం లభిస్తుందని తెలిపారు. అభ్యర్థులను ఆన్ లైన్ టెస్ట్, టెలిఫోనిక్ రౌండ్, హెచ్ఆర్ ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుందని, ఎంపికైన అభ్యర్థులు బెంగుళూరులో పనిచేయవలసి ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల అర్హులైన ప్రతీ ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మరిన్ని వివరాల కోసం ఆదిత్య శిక్షణ, నియామక విభాగం హరికృష్ణ గొట్టిపాటి మొబైల్ నంబర్: 9966439688 ను సంప్రదించాలని సతీష్ రెడ్డి తెలిపారు.

 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us