శ్రీ శారదా రామకృష్ణ సేవాసమితి సేవలు అభినందనీయం

UPDATED 24th JANUARY 2018 WEDNESDAY 9:00 PM

పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం శ్రీ శారదా రామకృష్ణ సేవాసమితి ఆధ్వర్యంలో పెద్దాపురం పాండవులమెట్టపై గల శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం వద్ద రధసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు ఉచిత పులిహోర, క్షీరాన్నం వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలల డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ఆదిత్య క్యాంపస్ ఇంచార్జ్, జిల్లా బాడ్మింటన్ కమిటీ సభ్యులు మేడపాటి భాస్కర చంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్ ముఖ్య అతిధిగా విచ్చేసారు. రధసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవస్థానానికి విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సమితి ఏర్పాటు చేసిన శిబిరాన్ని సందర్శించి సమాజంలో శ్రీ శారదా రామకృష్ణ సేవాసమితి లాంటి స్వచ్చంధ సంస్థలు మరిన్ని రావాలన్నారు. పెద్దాపురం పట్టణం నుంచే కాకుండా జిల్లా నలుమూలలు నుంచి ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాటు చేసిన ఉచిత పులిహోర, క్షీరాన్నం, మంచినీరు పంపిణి ఏర్పాట్లు చూసి మంత్రి చినరాజప్ప సమితి సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వి..శ్రీనివాసరావు, సిఎవో పి. కృష్ణమూర్తి, సమితి అధ్యక్షులు తోటకూర గంగాధర్, సభ్యులు పెంటపాటి మల్లికార్జునరావు, నువ్వుల బాబ్జి, కేదారశెట్టి సతీష్, జి. ప్రకాశరావు, కూనిరెడ్డి శ్రీనివాస్, పప్పల శ్రీనివాస్, యాదవ సంఘం సభ్యులు అనుముల సత్యనారాయణ, పంచగట్ల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.            

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us