UPDATED 9th APRIL 2018 MONDAY 9:00 PM
సామర్లకోట: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ వైఎస్ఆర్ సిపి చేపడుతున్నరిలే నిరాహారదీక్షలలో భాగంగా సోమవారం స్థానిక హెడ్ పోస్టాఫీసు వద్ద పెద్దాపురం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అసమర్ధత పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారని, రాబోయే రోజులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం తధ్యమని, కేవలం వైఎస్ఆర్ సిపి వల్లే ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఆవాల లక్ష్మీనారాయణ, నేతల హరిబాబు, మద్దాల శ్రీను, గంగిరెడ్డి కృష్ణమూర్తి, శెట్టిబత్తుల దుర్గ, అడబాల భద్రరావు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.







