విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ

UPDATED 30th JUNE 2018 SATURDAY 9:00 PM

సామర్లకోట: సామర్లకోట మండలం వెంకట కృష్ణరాయపురం ఉన్నత పాఠశాల విద్యార్థులకు అడబాల సూర్యప్రకాశరావు ఫౌండేషన్ అందించిన 3500 పుస్తకాలను జెడ్పిటిసి సభ్యురాలు గుమ్మళ్ల విజయలక్ష్మి చేతుల మీదుగా అందచేశారు. అలాగే పదవ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఎనిమిది మంది విద్యార్థులకు ఒక్కొక్కరికీ రూ. రెండువేలు చొప్పున ఆర్ధిక సహాయం శనివారం అందచేశారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. అనంతరం అడబాల సూర్యప్రకాశరావును గ్రామస్థులు, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, ఎంపిపి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us