ప్రజావాణికి ఎనిమిది అర్జీలు

UPDATED 2nd JULY 2018 MONDAY 7:30 PM

పెద్దాపురం: స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఎనిమిది అర్జీలు వచ్చినట్లు ఆర్డీవో ఎస్.ఎస్.బి.బి. వసంతరాయుడు తెలిపారు. వీటిలో శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన గౌతు బాబ్ది, సయ్యద్ సైరాభాను భూయాజమాన్య హక్కు పత్రాన్ని మంజూరు చేయమని, పెద్దాపురం పట్టణం పదవ  వార్డుకు చెందిన మారిన పద్మావతి, డి. నూకరాజు భూసర్వే నిమిత్తం, అలాగే అధికమొత్తంలో రూ. ఐదు వేలు కరెంటు బిల్లు వచ్చిందని బిల్లును సరిచేయమని, ఆన్ లైన్లో భూమికి సంబందించిన యజమాని పేరు నమోదు కాలేదని, కట్టమూరు గ్రామంలో పారిశుద్ధ్యం మెరుగుపరచమని, రేషన్ కార్డులో పేరును నమోదు చేయమని అర్జీలు వచ్చినట్లు ఆర్డీవో తెలిపారు. ఈ అర్జీలను పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు పంపడం జరుగుతుందని ఆయన తెలిపారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us