ఆదిత్య టెక్నికల్ హబ్ ఆధ్వర్యంలో గేమింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు

UPDATED 20th SEPTEMBER 2019 FRIDAY 9:00 PM

గండేపల్లి(రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలోని ఆదిత్య టెక్నికల్ హబ్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు గేమింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు టెక్నికల హబ్ సిఈవో బాబ్జి నీలం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంజనీరింగ్ విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంలో అవగాహన కల్పిస్తూ వారి పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు గేమింగ్ ఛాంపియన్ షిప్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈనెల 19న ప్రారంభమై 48 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగి 21వ తేదీ సాయంత్రంతో ఈ పోటీలు ముగుస్తాయని, రాష్ట్రంలో గల ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన 70మంది విద్యార్థులు 2డి,3డి గేమ్స్ రూపొందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా ప్రముఖ గేమింగ్ కంపెనీస్ స్ట్రీట్ లాంప్ గేమ్స్ సిఈవో దీపక్ గురజాల, స్టార్ ఔట్ గేమ్స్ సిఈవో వంశీ  వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ ఛాంపియన్ షిప్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రధమ బహుమతిగా రూ.30,000/-, ద్వితీయ బహుమతిగా రూ.15000/-, తృతీయ బహుమతిగా రూ.5000/- నగదు బహుమతులు అందిస్తామని తెలిపారు. విద్యార్థులలో సాంకేతిక పరిజ్ఞానం, వారిలో ప్రతిభను పెంచడానికి ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన టెక్నికల్ బృందాన్ని ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి అభినందించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us