TTD: శ్రీవారికి నివేదించిన పుష్పాలతో అగర్‌బత్తీల తయారీ ఆగమశాస్త్రానికి విరుద్ధం: శ్రీనివాసానంద సరస్వతి

విశాఖపట్నం (రెడ్ బీ న్యూస్) 11 డిసెంబర్ 2021: తిరుమల శ్రీవారికి నివేదించిన పుష్పాలతో అగర్‌బత్తీల తయారీ.. ఆగమశాస్త్రానికి విరుద్ధమని సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. జంబో పాలకమండలి సహా తితిదేలో చోటుచేసుకుంటున్న వివాదాలే ప్రకృతి విపత్తుల రూపంలో బయటపడుతున్నాయని విశాఖపట్నంలో ఆయన వ్యాఖ్యానించారు. స్వామివారికి అలంకరించిన పుష్పాలు, దండలను తిరిగి వినియోగించకూడదని ఆగమశాస్త్రం చెబుతోందని వివరించారు. వాటిని ప్రవహించే నీటిలో వేయడం.. లేదా భూమిలో పాతిపెట్టడం లాంటివి చేయాలని శాస్త్రాల్లో వివరించినట్టు తెలిపారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us