గవర్నర్ పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన సబ్-కలెక్టర్

UPDATED 12th NOVEMBER 2019 TUESDAY 5:00 PM

రాజానగరం(రెడ్ బీ న్యూస్): రాష్ట్ర గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్ ఈ నెల 14వ తేదీన పర్యటనకు సంబంధించి స్థానిక గైట్ కళాశాలలో జరుగుతున్న ఏర్పాట్లను రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ మంగళవారం పరిశీలించారు. భగవత్ స్వరూపులు జగద్గురు శంకరాచార్య పూరీ గోవర్ధన్ పీఠాధిపతి పూజ్యశ్రీ నిశ్చాలంద సరస్వతీ మహారాజ్ ఆరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ సందర్భంగా గవర్నర్ పర్యటనకు సంబంధించి హెలిపాడ్, సభావేదిక, పీఠాధిపతి బస చేసే ప్రాంతాలను సబ్ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా గైట్ కళాశాల ప్రాంగణంలో గవర్నర్, పీఠాధిపతులు కళాశాలలో పాల్గొనే కార్యక్రమాలను చైతన్య విద్యా సంస్థల చైర్మన్ కెవివి సత్యనారాయణరాజు (చైతన్య రాజు), గైట్ మేనేజింగ్ డైరెక్టర్ కె. శశికిరణ్ వర్మలు సబ్ కలెక్టరుకు వివరించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం తూర్పు మండల డిఎస్పీ ఎ.టి.వి. రమణ, రాజానగరం సిఐ సుభాష్, తహసీల్దార్ జి. బాలసుబ్రహ్మణ్యం, చైతన్య విద్యా సంస్థల సీఈవో డాక్టర్ డి.ఎల్.ఎన్. రాజు, జనరల్ మేనేజర్ ఎ. నరేష్ రాజు, విద్యుత్ శాఖ ఏఈ జి.ఎస్.వి.ఎస్.వి. ప్రసాద్, ఆర్ఐ రాజశేఖర్, విఆర్ఓ యోగేంద్ర, గైట్ ఓఎస్డీ డాక్టర్ నామగిరి బాబ్జి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రగాఢ గోవిందు, తదితరులు పాల్గొన్నారు.                   

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us