పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో భారీ అన్నదానం

UPDATED 12th SEPTEMBER 2019 THURSDAY 9:00 PM

సామర్లకోట (రెడ్ బీ న్యూస్): గణపతి నవరాత్రి ముగింపు ఉత్సవాలను పురస్కరించుకుని సామర్లకోట  పట్టణ, మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో భారీ అన్నదాన కార్యక్రమాలు గురువారం జరిగాయి. శ్రీ వరసిద్ధి వినాయక పండ్ల వర్తక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక స్టేషన్ సెంటర్,14వార్డు, వి.కె. రాయపురంలో గణపతి ఆలయాల వద్ద భారీ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ భారీ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దాపురం నియోజకవర్గ శాసన సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు పాల్గొని అన్నప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పళ్ళ వర్తక సంఘం యూనియన్ అధ్యక్షులు జీలకర్ర బాబురావు, అత్తిలి రఘు, గొల్లపల్లి నాగు, దాసరి నాని, పత్తి దుర్గ, పత్తి బుజ్జి, గొల్లపల్లి రామకృష్ణ, వైఎస్ఆర్ సిపి నాయకులు ఆవాల  లక్ష్మీనారాయణ, మద్దాల శ్రీనివాస్, కాళ్ల లక్ష్మీనారాయణ, శెట్టిబత్తుల దుర్గ, తెలుగుదేశం పార్టీ నాయకులు అడబాల కుమారస్వామి, యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, కంటే బాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం గణపతి నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us