UPDATED 11th OCTOBER 2018 THURSDAY 8:00 PM
పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామానికి చెందిన బొడ్డు వెంకటరమణ దంపతులు కాండ్రకోటలో వేంచేసిఉన్న నూకాలమ్మ అమ్మవారికి కిలో వెండి కంఠాభరణాన్ని బహూకరించినట్లు దేవస్థానం ఈవో పులి నారాయణమూర్తి తెలిపారు. అమ్మవారికి జరిగే ఉత్సవాల్లో ఈ కంఠాభరణాన్ని అలంకరించాలని దాతలు కోరారు. ఈ కార్యక్రమంలో గుడా డైరెక్టర్ ఎలిశెట్టి నాని, కట్టమూరు పిఎసిఎస్ చైర్మన్ చల్లా చినవీర్రాజు (చిన్ని), కట్టమూరు మాజీ సర్పంచ్ ముండ్రు శ్రీనివాస్, శ్రీ కేశవ,పట్టాభిరామస్వామి దేవస్థానం చైర్మన్ బొడ్డు శ్రీనివాస్, గవరసాన రాజశేఖర్, జోకా నానాజీ, గవరసాన సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.







