UPDATED 22nd DECEMBER 2020 TUESDAY 9:00 PM
రాజానగరం (రెడ్ బీ న్యూస్): జీసస్ పుట్టుక ప్రపంచ మానవాళికి వెలుగులు తీసుకువచ్చిందని సిస్టర్ బ్లేస్సి వెస్లీ అన్నారు. స్థానిక లెనోరా దంత వైద్య కళాశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. కళాశాల చైర్మన్ కె. నాగమణి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో సిస్టర్ బ్లేస్సి వెస్లీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఆనందోత్సాహాలతో క్రిస్మస్ పర్వదినాన్ని అత్యంత పవిత్రంగా జరుపుకుంటారని అన్నారు. చంచలమైన మనస్సు గల మానవులను సక్రమ మార్గంలో నడిపించేందుకు జీసస్ బోధనలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. మంచి పనులు చేసే వారికి దేవుడు ఎల్లప్పుడు తోడుగా ఉంటాడని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జీసస్ పుట్టుక, ప్రాముఖ్యతను వివరించి తన అనుభవాలను జోడించి విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో ఆమె వివరించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమంలో కెఎల్ఆర్ విద్యా సంస్థల కార్యదర్శి వై. మధుసూదన్ రెడ్డి, డైరెక్టర్ జి. నాగార్జునరెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ విశ్వప్రకాష్ శెట్టి, పీజీ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మణరావు, డాక్టర్ జాకబ్ ప్రకాష్, డాక్టర్ నవీన్, డాక్టర్ శ్రీదేవి, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







