ఉత్సాహంగా పాఠశాల వార్షికోత్సవ వేడుకలు

UPDATED 4th APRIL 2019 THURSDAY 9:00 PM

సామర్లకోట: విద్యార్థి జీవితంలో ఉన్నత పాఠశాల స్థాయిలో గడిపిన ఐదు సంవత్సరాలు ఎంతో  విలువైనవని, విలువలతో కూడిన జీవనాన్ని సాగించడానికి హైస్కూల్ లో నేర్చుకున్న అనుభవాలు ఎంతగానో ఉపయోగపడతాయని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాల హెమ్ఎం తోటకూర సాయిరామకృష్ణ పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల ఫేర్ వెల్ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులందరూ నూరు శాతం ఉత్తీర్ణతపై ఆశాభావంతో ఉండటంతో పరీక్షల ముగిసిన జోష్ తో ఆనందంగా గడిపారు. విద్యార్థులు తమ ఉపాధ్యాయులతో తాము నేర్చుకున్న నైపుణ్యాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ క్రమశిక్షణతో ఎంచుకున్న రంగాలలో స్థిరపడి పాఠశాలకు మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో ముందుగా  హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ గరికిపాటి వెంకటరామయ్య విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పిడి తాళ్లూరి వైకుంఠం, ఉపాధ్యాయులు షఫీయుల్లా, జి. గోవిందు, కె. అరుణ, కెవివి సత్యనారాయణ, ఏ.ఎల్.వి. కుమారి, రాజేంద్రకుమార్, అధిక సంఖ్యలో విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us