UPDATED 23rd AUGUST 2017 WEDNESDAY 9:00 PM
మండపేట: తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరంలోని ప్రసిద్ధ సురుచి ఫుడ్స్ సంస్థ హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని గణనాథునికి సమర్పించే 500 కేజీల లడ్డూ తయారీ బుధవారం పూర్తిచేశారు. తమ సంస్థ సిబ్బంది గణేష్ మాలలు ధరించి అత్యంత నియమ నిష్ఠలతో ఈ భారీ లడ్డును తయారు చేసినట్లు సురుచి ఫుడ్స్ సంస్థ అధినేత పోలిశెట్టి మల్లిబాబు తెలిపారు. గురువారం అలంకరణ పూర్తిచేసి ప్రత్యేక వాహనంలో దీనిని తరలించనున్నట్లు తెలిపారు. ఈ లడ్డూ తయారీ కోసం 180 కిలోల పంచదార, 140 కేజీల నెయ్యి, 155 కిలోల శనగపప్పు, 25 కేజీల డ్రై ఫ్రూట్స్, 2.5 కేజీల యాలకులు, పావు కిలో పచ్చకర్పూరం వినియోగించినట్లు ఆయన తెలిపారు.







