అంగన్వాడీ సిబ్బందిపై రాజకీయ వేధింపులు నిరోధించాలి

UPDATED 16th AUGUST 2019 FRIDAY 9:00 PM

సామర్లకోట: అంగన్వాడీ సిబ్బందిపై రాజకీయ వేధింపులు నిరోధించాలని కోరుతూ సామర్లకోట అర్బన్, రూరల్ ప్రాజెక్ట్ కార్యాలయాల వద్ద అంగన్వాడీ సిబ్బంది శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ నూతనంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంగన్వాడీ సిబ్బందిపై రాజకీయ వేధింపులు ఎక్కువ అయ్యాయని, గుంటూరు జిల్లా ఈపూరు సిడిపివో, సూపర్ వైజర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిడిపివోలు టీడీఆర్ పద్మావతి, ఉషకు వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ల నాయకులు వి. ఎస్తేరురాణి, ఎన్ కె ఫాతిమా, జి. మహాలక్ష్మి, యు. బాలజ్యోతి, కె. వరలక్ష్మి వి. వెంకటలక్ష్మి, ఎంవి శ్రీలక్ష్మి, రమణమ్మ, టి. నాగమణి, అధిక సంఖ్యలో అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us