UPDATED 3rd DECEMBER 2018 MONDAY 9:00 PM
సామర్లకోట: దివ్యాంగులను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని జెడ్పీటీసీ సభ్యురాలు గుమ్మళ్ళ విజయలక్ష్మి అన్నారు. ఎంఈవో పులపకూర జాన్ అధ్యక్షతన స్థానిక భవిత విద్యా కేంద్రం ఆవరణలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జెడ్పీటీసీ సభ్యురాలు గుమ్మళ్ళ విజయలక్ష్మి హాజరై మాట్లాడుతూ దివ్యాంగులకు సమాజంలో తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందని, వారు అన్నిరంగాల్లో ఎదగడానికి ప్రోత్సహించాలన్నారు. 1995లో దివ్యాంగుల హక్కుల చట్టం అమల్లోకి తెచ్చినప్పటి నుంచి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు, ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేస్తోందన్నారు. దివ్యాంగులంతా చట్టంలో తమకున్న హక్కులను తెలుసుకోవాలన్నారు. అనంతరం దివ్యాంగ విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి ఆమె చేతుల మీదుగా బహుమతులు అందచేశారు.







