AP News: తుపాకీతో కాల్చుకుని ఏఆర్‌ అధికారి ఆత్మహత్య

విజయనగరం (రెడ్ బీ న్యూస్) 2 జనవరి 2022 : విజయనగరంలో హోమ్‌ గార్డ్స్‌ విభాగం ఏఆర్‌ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విజయనగరం జిల్లా హోమ్‌గార్డ్స్‌ విభాగం ఏఆర్‌ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈశ్వర్‌రావు పోలీస్‌ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ ఉదయం తన వద్ద ఉన్న సర్వీస్‌ రివాల్వర్‌తో రెండు రౌండ్లు కాల్చుకున్నాడు. అతడి మృతదేహాన్ని విజయనగరం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us