UPDATED 30th OCTOBER 2018 TUESDAY 9:00 PM
సామర్లకోట: మండల పరిధిలోని వేట్లపాలెం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడుగా సేవలు అందించిన కోడూరి వెంకటరమణ పదవీ విరమణ సన్మాన సభ మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బొడ్డు భాస్కరరామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాస్కర రామారావు మాట్లాడుతూ వెంకటరమణ ఎంతో అంకితభావంతో ఉపాధ్యాయునిగా సేవలు అందించారని, ఆయన శేష జీవితం ఆనందంగా కొనసాగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయుడు వెంకటరమణ మాట్లాడుతూ తన ఉన్నతికి భాస్కర రామారావు గారే కారణమని, ఆయనకు జీవితాంతం ఋణపడి ఉంటానని అన్నారు. అనంతరం వెంకటరమణ దంపతులను ఎంఎల్సీ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట జెడ్పీటీసీ గుమ్మళ్ళ విజయలక్ష్మి, గోలి వెంకట్రావు, విప్పర్ల సత్యనారాయణ, జాన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







