అమరావతి (రెడ్ బీ న్యూస్) 6 డిసెంబర్ 2021 : ‘కొత్తగా వేసే ప్రైవేటు లేఅవుట్లలో 5% స్థలాన్ని ఇకపై వైఎస్‌ఆర్ జగనన్న హౌసింగ్ ప్రాజెక్టుకు కేటాయించాలి. సాధ్యం కాదనుకుంటే ప్రాథమిక విలువపై స్థలానికి డబ్బైనా చెల్లించాలి’ అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంబంధిత జీవోను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ సోమవారం జారీ చేసింది. ఈ మేరకు 2017 లేఅవుట్, సబ్-డివిజన్ నిబంధనలను సవరించారు. ప్రస్తుతం ప్రతి లేఅవుట్‌లో 10% స్థలాన్ని సామాజిక అవసరాల కోసం వ్యాపారులు కేటాయిస్తున్న దానికి ఇది అదనం. ఈ స్థలాన్ని పేదల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్‌ఆర్ జగనన్న హౌసింగ్ ప్రాజెక్టు కోసం వినియోగించనున్నట్లు పురపాలకశాఖ పేర్కొంది. పట్టణాభివృద్ధి సంస్థలు, పురపాలక సంఘాల పరిధిలో స్థిరాస్తి వ్యాపారులు వేసే లేఅవుట్లకు కొత్తగా తీసుకున్న ఈ నిర్ణయం వర్తిస్తుందని స్పష్టం చేసింది.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







