అంకితభావంతో సమాజంలో గుర్తింపు

* మున్సిపల్ కమీషనర్ సి హెచ్. వెంకటేశ్వరావు

UPDATED 29th OCTOBER 2018 MONDAY 9:00 PM

సామర్లకోట: అంకితభావంతో పనిచేసే వారికి సమాజంలో ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని  మున్సిపల్ కమీషనర్ సిహెచ్. వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాల హెచ్ఎం తోటకూర సాయిరామకృష్ణ కందుకూరి జాతీయ శతస్మారక అవార్డు పొందిన సందర్భంగా సోమవారం ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమీషనర్ మాట్లాడుతూ గణిత అవధానిగా, రాష్ట్ర రిసోర్స్ పర్సన్ గా, గణిత పాఠ్య పుస్తక రచయితగా, అలాగే  వివిధ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ  జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా స్టేట్ ఎక్స్ లెంట్ అవార్డులు పొంది, నేడు ఈ అవార్డు పొందడం అభినందనీయమన్నారు. విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయుల సమన్వయంతో పాఠశాలను ముందంజలో ఉంచడం, పట్టణ పరిధిలో ఉత్తమ పాఠశాలగా గుర్తింపు తీసుకురావడంలో ఆయన కృషికి నిదర్శనమన్నారు. భవిష్యత్తులో ఆయన ఆధ్వర్యంలో పాఠశాలకు మరింత గుర్తింపు రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనేరుతో పాటు హెచ్ఎంలు ఆర్. శ్రీనివాసరాజు, యు. సత్యనారాయణ, టి. శ్యాంసుందర్, ఉపాధ్యాయులు జి. గోవిందు, ఎ.ఎల్.వి. కుమారి, కె. అరుణ, కెవివి. సత్యనారాయణ, ఫిజికల్ డైరెక్టర్లు తాళ్లూరి వైకుంఠం, ఎం. వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయిరామకృష్ణ మాట్లాడుతూ అవార్డు తనపై మరింత బాధ్యత పెంచిందని పేర్కొంటూ కృతజ్ఞతలు తెలియజేశారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us