అమరవీరులకు పాత్రికేయులు ఘన నివాళి

UPDATD 18th FEBRUARY 2019 MONDAY 8:00 PM

పెద్దాపురం: జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ జవాన్లపై ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ ప్రాణత్యాగం చేసిన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ పెద్దాపురం నియోజకవర్గ పాత్రికేయులు సోమవారం పట్టణంలో పలు వీధుల గుండా శాంతి ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక మున్సిపల్ జంక్షన్ వద్ద ఐదు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉగ్రవాదులు సైనికులపై దాడి చేయడాన్ని హేయమైన చర్యగా అభివర్ణించి, ప్రాణత్యాగం చేసిన జవాన్ల సేవలను కొనియాడారు. ఉగ్రవాదుల దొంగదెబ్బకు అశువులు బాసిన భారతమాత ముద్దుబిడ్డలు వీర జవాన్ల త్యాగం వృథాగా పోదని, వారి త్యాగాలను నిరంతరం గుర్తు చేసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు అడపా వెంకట్రావు, రెడ్డిపల్లి రమణమూర్తి, మొల్లి సూర్యనారాయణ, రాకుర్తి రాంబాబు, మాసా చంద్రరావు (చందు), ఉప్పలపాటి చంద్రదాస్, అలమండ రంగనాథస్వామి, అలమండ ప్రసాద్, ఎలిశెట్టి సత్యనారాయణ, పెమ్మాడి వీరభద్రవర్మ, ఇర్షాద్ ఆలీ, దేవరకొండ సుధాకర్, బద్ది కుమార్, వినాయక్, సుబ్బు, సూరిబాబు, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us