జిల్లాస్థాయి ఇస్కాన్ పోటీల్లో ఆదిత్య విద్యార్థిని ప్రతిభ

UPDATED 29th JANUARY 2019 TUESDAY 5:00 PM

గండేపల్లి: రాజమహేంద్రవరం ఇస్కాన్ సంస్థాపకాచార్యులు శ్రీప్రభుపాద జీవిత చరిత్రపై ఇస్కాన్ సంస్థ  నిర్వహించిన జిల్లాస్థాయి పోటీ పరీక్షల్లో వివిధ కేటగిరీలలో గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్  ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన డి. ఈశ్వరి సాయిసంతోషి ఐదవ స్థానం సాధించింది. ఈ సందర్భంగా  ఇస్కాన్ సంస్థ రూ. రెండు వేలు నగదు బహుమతితో పాటు మెరిట్ సర్టిఫికెట్, మెమెంటోను విద్యార్థినికి అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆదిరెడ్డి రమేష్, విభాగాధిపతి రవికుమార్, లైబ్రేరియన్ వెంకటరమణ, ఎన్. సింహాచలం, కళాశాల సిబ్బంది, తదితరులు విద్యార్థినిని అభినందించారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us