ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడులు

UPDATED 10th OCTOBER 2018 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: ప్రకృతి వ్యవసాయంతో రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని ఆత్మ ప్రాజెక్టు ఏవో ఎస్. మల్లిబాబు అన్నారు. మండల వ్యవసాయాధికారి ఎన్. శ్యామూల్ జాన్ అధ్యక్షతన మండల పరిధిలోని అచ్చంపేట గ్రామంలో ఎఎంసి స్థాయిలో ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక వర్క్ షాపును బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మల్లిబాబు మాట్లాడుతూ రైతులు ప్రకృతి వ్యవసాయంలో భాగంగా తయారైన వివిధ రకాల కాషాయలతో పంటలు పండించడం వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు భూసారం పెంపొంది అధిక దిగుబడులు సాధించవచ్చని అన్నారు. అలాగే పంటలు ఆరోగ్యంగా పెరిగి ఏవిధమైన తెగుళ్లు దరిచేరవని తెలిపారు. అనంతరం రైతులకు ప్రకృతి వ్యవసాయానికి ఉపయోగపడే డ్రమ్ములను ఆయన రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఇవో సతీష్, ఆత్మ సిబ్బంది జి. రూప, కె. అశ్విని, ఎంపీఈవో శివ కామేష్, సీఆర్పీలు విజయలక్ష్మి, లక్ష్మణస్వామి, రైతు నాయకులు మంగరాజు, సుబ్రహ్మణ్య ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us