ఏప్రిల్ 2న ఛలో గుంటూరు

UPDATED 24th MARCH 2018 SATURDAY 9:00 PM

సామర్లకోట: ఎం.ఆర్.పి.ఎస్ అధ్యక్షుడు మందా కృష్ణ మాదిగ ఇచ్చిన పిలుపు మేరకు ఏప్రిల్ రెండవ తేదీన ఛలో గుంటూరు మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ స్థానిక కుమ్మరవీధిలోని బాబూ జగజ్జీవన్ రాం కమ్యూనిటీ హాలులో గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేం అధికారంలోకి వస్తే వంద రోజుల్లో వర్గీకరణ అని నమ్మించి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా పట్టించుకోని కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై తిరుగుబాటు మహాసభ గుంటూరు భాష్యం స్కూల్లో జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.ఆర్.పి.ఎస్ నాయకులు వల్లూరి వాణి మాదిగ, కొల్లి చైతన్యకుమార్, నందిక చక్రం, మందపల్లి వెంకన్న, దొమ్మిడివరపు మహేష్, ఏడిద పోతురాజు, చింతాడ సాల్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us