UPDATED 28th AUGUST 2017 MONDAY 1:00 PM
గండేపల్లి : తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ లో ఈ నెల 30, 31 తేదీల్లో క్యాంపస్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు సంస్థ వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీ క్యాప్ జెమిని(బెంగుళూరు) సంస్థ ఈ ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగు తుందని తెలిపారు. ఈఈఈ, ఈసీఈ, సీఈసీ, ఐటి, ఫైనల్ ఇయర్ విద్యార్థులకు (ఆన్ క్యాంపస్) ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారని తెలిపారు. ఈ ఇంటర్వ్యూ లో ఆన్ లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్, వ్రాతపరీక్ష, సూడో కోడ్ టెస్ట్, టెక్నికల్ టెస్ట్, హెచ్ ఆర్ ఇంటర్వ్యూ ప్రక్రియల ద్వారా ఎంపిక విధానం ఉంటుందని, అభ్యర్థి ఒక్క బ్యాక్ లాగ్ కూడా లేకుండా 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారందరూ అర్హులని ఆయన పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్ధికి రూ.3.20 లక్షలు వార్షిక వేతనం లభిస్తుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె రామకృష్ణారావు, ఆదిరెడ్డి రమేష్, ప్లేసెమెంట్ విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు.







