సామర్లకోట, 27 అక్టోబరు 2020 (రెడ్ బీ న్యూస్):
ఆంధ్రప్రదేశ్ సర్వే ట్రైనింగ్
అకాడమీ సామర్లకోటలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న
టి.త్రివిక్రమరావుకు జాతీయ
పురస్కారం లభించింది. ఈమేరకు ఆయనను ఉత్తమ గెజిటెడ్ అధికారిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి
లేఖ అందింది. నవంబరు 1న విజయవాడలో జరిగే
ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారాన్ని
అందుకోనున్నారు. త్రివిక్రమరావు 232 మంది ఉప
సర్వేయర్లకు, 9424 గ్రామ సర్వేయర్లకు శిక్షణ
ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. జాతీయ పురస్కారానికి ఎంపికైన త్రివిక్రమరావును సర్వే
అకాడమీ జాయింట్ డైరెక్టర్ సీహెచ్ వీఎస్ఎన్ కుమార్
తదితరులు అభినందించారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







