UPDATED 16th MAY 2019 THURSDAY 6:30 PM
పెద్దాపురం: పెద్దాపురం-సామర్లకోట ప్రధాన రహదారిలో స్థానిక ఏలేరు ఇరిగేషన్ కార్యాలయం వద్ద ఇరిగేషన్ శాఖకు చెందిన ఖాళీ స్థలాన్ని జిల్లా కలెక్టర్ కార్తికేయమిశ్రా, రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.ఎస్. రావత్ తో కలిసి గురువారం పరిశీలించారు. ఇరిగేషన్ శాఖకు చెందిన ఈ స్థలం మొత్తం 13 ఎకరాల 96 సెంట్లు కాగా, వీటిలో డీఎస్పీ కార్యాలయానికి 40 సెంట్లు, ఎంపిడివో కార్యాలయానికి 44 సెంట్లు, ఇరిగేషన్ కార్యాలయానికి 46 సెంట్లు వినియోగంలో ఉండగా, మిగిలిన 12 ఎకరాల 66 సెంట్ల స్థలంలో 5 ఎకరాల స్థలాన్ని గురుకుల పాఠశాల నిర్మాణానికి కేటాయించే నిమిత్తం వారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం తహసీల్దార్ కలగర గోపాలకృష్ణ, ఎంపిడివో పి. ఉమామహేశ్వరరావు, మున్సిపల్ కమీషనర్ బి.ఆర్. శేషాద్రి, వైఆర్సీ జెఈ కె.వి. లక్ష్మీనారాయణమ్మ, డిప్యూటీ తహసీల్దార్ టి. కృష్ణారావు, ఎస్ఐ ఎ. కృష్ణ భగవాన్, జగ్గంపేట గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ భారతలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.







