గంగవరం (రెడ్ బీ న్యూస్) 2 నవంబర్ 2021: ఈ నెల 5వ తేదీన నిర్వహించనున్న ఏపీ సీఎం కప్ క్రీడా పోటీలను విజయవంతం చేయాలని ఎంపీడీవో జాన్ మిల్టన్ ఎంఈఓ మల్లేశ్వరరావు కోరారు. స్థానిక ఎంఆర్సీలో క్రీడా పోటీల నిర్వహణపై వ్యాయామ ఉపాధ్యాయులు, డైరెక్టర్లతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ యువతలో క్రీడా నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయసులోపు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పోటీల్లో పాల్గొనవచ్చు అని అన్నారు. పోటీలకు హాజరయ్యేవారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న క్రీడా ప్రాంగణంలో శుక్రవారం ఉదయం ఆధార్ కార్డ్, పదవ తరగతి మార్క్ లిస్ట్ జిరాక్స్ కాపీలతో హాజరుకావాలన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలు రంపచోడవరంలో నిర్వహించే డివిజన్ స్థాయి పోటీలకు అర్హులవుతారని, ఈ క్రీడా పోటీల్లో వాలీబాల్, కబడ్డీ, రన్నింగ్, జావెలిన్ త్రో, లాంగ్ జంప్ వంటి క్రీడలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







