సమిష్టి కృషితోనే జర్నలిస్టుల సమస్యల పరిష్కారం

* ఏపీయూడబ్ల్యూజే యూనియన్ సీనియర్ నాయకులు

UPDATED 20th JULY 2019 SATURDAY 6:00 PM

పెద్దాపురం: జర్నలిస్టుల సమిష్టి కృషితోనే వారి సమస్యల పరిష్కారం సాధ్యపడుతుందని ఏపీయూడబ్ల్యూజే అనుబంధ  పెద్దాపురం నియోజకర్గ ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షులు ఆడపా వెంకట్రావు, రెడ్డిపల్లి రమణమూర్తి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాకుర్తి రాంబాబు అన్నారు. స్థానిక ఆర్అండ్ బి అతిథి గృహంలో యూనియన్ సమావేశం క్లబ్ అధ్యక్షులు ఉప్పలపాటి చంద్రదాస్ అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ సీనియర్ నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టులకు కల్పిస్తున్న అవకాశాలను సమిష్టిగా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. యూనియన్ బలోపేతంగా ఉన్నందున సభ్యులందరూ మరింత ఐక్యమత్యంతో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామని వారు పిలుపునిచ్చారు. అనంతరం వార్షిక బడ్జెట్ కార్యదర్శి దేవరకొండ సుధాకర్ ప్రవేశపెట్టగా కోశాధికారి, జిల్లా కార్యవర్గ సభ్యులు పెమ్మాడి వీరభధ్రవర్మ సమావేశంలో చదివి వినిపించారు. అనంతరం వివిధ అంశాలను అజెండాలో పొందుపర్చి పలు తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి మాసా చందు, బద్ది కుమార్, ఎన్.పి.ఎస్. వినాయక్, బిక్కిన వెంకట్, ఎస్. సూరిబాబు, శ్రీకాంత్, చవ్వాకుల ఈశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.  

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us