దేశాభివృద్ధిలో విద్యార్థులు భాగస్వాములు కావాలి

UPDATED 14th NOVEMBER 2018 WEDNESDAY 6:00 PM

పెద్దాపురం: విద్యార్థులు చదువుతో సమానంగా సేవా కార్యక్రమాలలో పాల్గొని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి అన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ పిజిడిఎం ప్రథమ సంవత్సరం విద్యార్థులు బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల పరిధిలోని ఆనూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన 200 మంది విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, పెన్నులు, రబ్బర్లు, తినుబండారాలను బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆస్థాశర్మ మాట్లాడుతూ బాల్యం నుంచి విద్యార్థులు సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని, అలాగే వారు నిర్వహించే కార్యక్రమాలతో జూనియర్ విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పిజిడిఎం ప్రథమ సంవత్సరం మెంటార్ డాక్టర్ మెహర్జీ దువ్వూరి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్. నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు.           

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us