ఓజోన్ పొర పరిరక్షణ మనందరి భాద్యత

UPDATED 15th SEPTEMBER 2018 SATURDAY 9:00 PM

సామర్లకోట:వాతావరణంలో సహజ రక్షణ పొరగా ఉన్న ఓజోన్ పొర రక్షించుకునే బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని మున్సిపల్ కమీషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ నెల 16వ తేదీ ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక అయోధ్యరామపురం మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తోటకూర సాయిరామకృష్ణ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన భారీ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ కమీషనర్ వెంకటేశ్వరావు మాట్లాడుతూ ఆక్సిజెన్ మరో రూపమే ఓజోన్‌ అని, ఇది విషవాయువని, ప్రతీ ఓజోన్‌ అణువులోను మూడు ఆక్సీజన్ పరమాణువులు ఉంటాయన్నారు. వాతావరణపు గాలి పొరలో భూ ఉపరితలానికి సుమారుగా 15 - 50 కిలోమీటర్ల వరకు సహజంగా ఏర్పడి ఉంటుందన్నారు. సూర్యుని నుండి వచ్చే అతినీలలోహిత కిరణాలను భూమి పైకి రాకుండా అడ్డుకొని జీవరాశిని రక్షిస్తుందన్నారు. ఓజోన్‌ పొర తరిగిపోవడం వల్ల అతి నీల లోహిత కిరణాలు భూమిని తాకడం అధికమై జన్యువులు, కళ్ళు దెబ్బ తినడంతో పాటు సముద్ర జీవరాశి పై దుష్ప్రభావాన్ని చూపిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి సౌజన్యంతో ఓజోన్ దినోత్సవ సందర్భంగా విద్యార్థులకు పర్యావరణం పరిరక్షణపై వివిధ అవగాహనా కార్యక్రమాలు  ఏర్పాటు చేసినట్లు హెచ్ఎం తెలిపారు. అనంతరం ఓజోన్ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులు పట్టణ పురవీధులల్లో ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తాళ్లూరి వైకుంఠం, ఎ.ఎల్.వి.కుమారి, షఫీయుల్లా, జి. గోవిందు, కె. అరుణ, కె.వి.వి సత్యనారాయణ, కె. శ్రీనివాస్, ఎపి రాజేంద్రకుమార్, రమాదేవి, శ్రీవల్లి, శ్రీలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు....

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us