UPDATED 5th JULY 2019 FRIDAY 7:00 PM
పెద్దాపురం: పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలలో భాగంగా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు శుక్రవారం ఉదయం పరిశీలించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్ధం ఈ శిబిరాన్ని ఆలయం ఎదురుగా ఉన్న మున్సిపల్ గెస్ట్ హౌస్ లోకి మార్చాలని మున్సిపల్ కమీషనర్ బి.ఆర్. శేషాద్రి, దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ కె. విజయలక్ష్మిలను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కలగర గోపాలకృష్ణ, దేవస్థానం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







