శ్రీప్రకాష్ లో ఆకట్టుకున్న మొబైల్ ప్లానిటోరియం

UPDATED 2nd MAY 2019 THURSDAY 9:00 PM

పెద్దాపురం: స్థానిక రామారావుపేటలో గల శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణా తరగతుల్లో భాగంగా పాఠశాల యాజమాన్యం ముంబయి నుంచి తీసుకువచ్చిన మొబైల్ ప్లానిటోరియం విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ మొబైల్ ప్లానిటోరియంలో కూర్చుని విద్యార్థులు విశ్వంలో విహరించిన అనుభూతిని పొందారు. వైజ్ఞానిక, సాంకేతిక, విజ్ఞానాన్ని త్రీడీ గ్రాఫిక్స్ రూపంలో విశ్వాన్ని చూసిన విద్యార్థులు ఎంతో ఆనందానికి లోనయ్యారు. ఈ ప్లానిటోరియంలో విశ్వానికి సంబంధించిన ఎన్నో రహస్యాలను విద్యార్థులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల డైరెక్టర్ సిహెచ్ విజయప్రకాష్ మాట్లాడుతూ తమ సంస్థ విద్యార్థులకు విజ్ఞానంతో పాటు వినోదం కూడా అందించి తద్వారా  భావి శాస్త్రవేత్తలుగా భవిష్యత్తులో వారు ఎదగాలన్న ఆకాంక్షతో ఈ మొబైల్ ప్లానిటోరియంతో విశ్వంపై అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ప్రిన్సిపాల్ ఎంవీవీఎస్ మూర్తి, సీవోవో కెఎస్ రావు, అకాడమిక్ కోఆర్డినేటర్లు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.             

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us