UPDATED 26th JANUARY 2021 TUESDAY 7:00 PM
కాకినాడ (రెడ్ బీ న్యూస్): విధి నిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచిన పెద్దాపురం ఆర్డీవో ఎస్. మల్లిబాబు ఉత్తమ సేవా పురస్కారం అందుకున్నారు. కాకినాడ జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో మంగళవారం నిర్వహించిన 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి ఆయనకు ఈ పురస్కారం అందచేసి ప్రశంసా పత్రం బహూకరించారు. ఈ సందర్భంగా కాకినాడ ఎంపీ వంగా గీత, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మితో పాటు తదితరులు మల్లిబాబును అభినందించారు.







